సాయిపల్లవి సవాల్….. రానా ఓకే!

466
rana

దేశవ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం సినీ, రాజకీయ ప్రముఖులు ఇటీవల గ్రీన్ ఇండియా చాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటుతూ మరికొందరిని నామినేట్ చేస్తున్నారు.

వరుణ్ తేజ్ ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన సాయి పల్లవి తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని ఈ సందర్భంగా పేర్కొంది.

సాయిపల్లవి చాలెంజ్‌ను స్వీకరించిన రానా సరే బాస్ అంటూ రిప్లై ఇచ్చాడు.