సీఎం కేసీఆర్‌ను కలిసిన సాగర్‌ ఎమ్మెల్యే భగత్‌..

46
mla bhagath

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో విజయం సాధించిన అనంతరం, మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నోముల భగత్ అతని కుటుంబ సభ్యులు సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడాలని సీఎం కేసీఆర్‌ భగత్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి వినోద్ కుమార్, టిఆర్ఎస్ జనరల్ సెక్రటరీలు తక్కెల్లపెల్లి రవీందర్ రావు, సోమా భరత్ కుమార్ తదితరులు ఉన్నారు.