సీఎం కేసీఆర్‌ను కలిసిన సిద్దిపేట చైర్ పర్సన్..

43

సిద్దిపేట మున్సిపల్ నూతన చైర్ పర్సన్ కడవేర్గు మంజుల రాజనర్సు,, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు సోమవారం మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. వీరు ఇటీవల సిద్ధిపేటలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుండి గెలుపొందారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

సిద్దిపేట మున్సిపాలిటీలో మొత్తం 43వార్డులకు గానూ 36 స్థానాలు టీఆర్ఎస్ కైవసం చేసుకోగా.. ఇండిపెండెంట్‌గా గెలిచిన ముగ్గురు టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. దీంతో టీఆర్ఎస్ బలం 39కి చేరింది. దీంతో సిద్ధపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీఆర్ఎస్ దక్కించుకుంది.