సబ్జా గింజలతో.. డీహైడ్రేషన్ కు చెక్

74
- Advertisement -

శీతకాలం ముగింపు దశకు వచ్చేసింది. వేసవికాలం రాబోతుంది.. భగ భగ మండే ఎండల తాకిడికి శరీరం డీహైడ్రేషన్ బారిన పడడం, వంట్లో నీతిశాతం తగ్గడం, వడదెబ్బలు.. ఇలా ఎన్నో సమస్యలు ఈ వేసవిలో చుట్టుముడతాయి. వేసవిలో శరీరం యొక్క వేడిని తగ్గించేందుకుతో చల్లచల్లని ద్రవ పదార్థాలు తీసుకోవడానికి ఎంతోమంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే శీతల పానీయాలలో సబ్జా గింజలతో తయారు చేసిన ద్వారా పదార్థాలు ఈ వేసవిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఎండకాలంలో ఈ సబ్జా గింజలు కలిపిన ద్రవాలు తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. సబ్జా గింజలలో కాల్షియం అధికంగా ఉంటుంది.

అంతే కాకుండా ఇందులో ఐరన్, విటమిన్ బి1, బి2, బి3, విటమిన్ కె వంటివి కూడా ఉంటాయి. అందువల్ల సబ్జా గింజలు వేసవిలో శరీర ఉష్ణోగ్రతను సమతుల్య పరుస్తాయి. ఇక ఇందులో ఉండే ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తాయి. సబ్జా గింజలలో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల శరీరంలోని అన్నీ భాగాలకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సబ్జా గింజలలో ఉండే ఫోలిక్ యాసిడ్ వల్ల మెదడుకు మరింత శక్తి లభిస్తుంది. తద్వారా మానసిక ఒత్తిడి తగ్గి.. మనసుకు ఉల్లాసం పెరుగుతుంది. ఇక సబ్జా గింజలలో ఒమేగా 3 కూడా ఉంటుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

సబ్జా గింజలు కలిపిన పానీయాలను ఈ వేసవిలో తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సబ్జా గింజలను తాజా కొబ్బరిపాలతో కలిపి తాగితే శరీరంలోని వేడి వెంటనే తగ్గిపోతుంది. ఇక సబ్జా గింజలను సాఫ్ట్ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూస్, శరబత్.. ఇలా ఆయా రకాల పానీయాలలో కలిపి అమ్ముతు ఉంటారు. సబ్జా గిజలలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్దకం సమస్య దూరం అవుతుంది. ఊబకాయంతో భాద పడేవారు సబ్జా గింజలు కలిపిన పానీయాలను తరచూ సేవిస్తే త్వరగా బరువు తగ్గవచ్చట.

Also Read:అవిసె గింజలు తింటే ఎన్ని లాభాలో..!

- Advertisement -