BSPకి RSP రాజీనామా

35
- Advertisement -

బీఎస్పీకి ఆ పార్టీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ పోస్టు చేసిన ఆర్‌ఎస్పీ.. వేరే మార్గం లేదని.. ఈ నిర్ణయం తీసుకుంటున్నందుకు తనను క్షమించాలని పేర్కొన్నారు. ఇప్పుడు కొత్త మార్గంలో వెళ్లే సమయం ఆసన్నమైనందున నేను ఈ నిర్ణయం తప్పక తీసుకోవాల్సి వస్తోందన్నారు.

బరువెక్కిన హృదయంతో బహుజన్ సమాజ్ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నాను. నా నాయకత్వంలో తెలంగాణలో ఇటీవలి నిర్ణయాల వల్ల బీఎస్పీ పార్టీ ఇమేజ్ దెబ్బతినడం నాకు ఇష్టం లేదు. అదే సమయంలో నేను కొన్ని ప్రధాన సూత్రాలు, వ్యక్తిగత పాత్రపై రాజీ పడకూడదనుకుంటున్నాను అని చెప్పారు.

స్వేరోగా నేను ఎవరినీ నిందించను, నన్ను నమ్మిన వారిని కూడా మోసం చేయకూడదు అన్నారు. పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదుడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే. కష్టసుఖాలు పంచుకోవాల్సిందే. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం అని తెలిపారు. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను అని తెలిపారు. ఈ సందర్భంగా తనకు సహకరించిన బీఎస్పీ చీఫ్ మాయవతికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:వైసీపీ ఎంపీ అభ్యర్థులు వీరే….

- Advertisement -