ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్..

21
- Advertisement -

85 ఏళ్లు దాటిన వారికి ఇంటి నుండే ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం కల్పిస్తున్నామని ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామని…బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేన నిఘా ఉంటుందన్నారు.ప్రతి వెయ్యి మంది పురుషులకు 948 మహిళా ఓటర్లు ఉన్నారన్నారు.స్టార్ క్యాంపెయినర్లు ఎన్నికలు నిబంధనలు పాటించాలన్నారు.

ఎన్నికల సందర్భంగా ప్రలోభాలకు గురిచేసే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు.ఈడీ సహకారంతో అన్ని రాష్ట్రాల్లో నిఘా పెంచామన్నారు.ఈసీకి వచ్చే ఫిర్యాదులపై వేగంగా విచారణ చేపడతామన్నారు.టీవీ, సోషల్ మీడియా ప్రక్రటనలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. కానుకలను, ప్రలోభాలను అడ్డుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రచారంలో ఎవరూ హద్దుమీరి వ్యాఖ్యలు చేయవద్దు అన్నారు.

హింసకు పాల్పడితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఎన్నికల్లో హింసను ప్రోత్సహిస్తే సహించేది లేదన్నారు.ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 48 వేలు,దివ్యాంగులు 88 లక్షల మందిఓటర్లు ఉన్నారన్నారు.కులం, మతానికి సంబంధించిన ప్రసంగాలు చేయవద్దన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కేంద్రాలతో నిఘా ఉంచుతామన్నారు.

- Advertisement -