ప్రైవేట్ కేంద్రాల్లో బూస్టర్ డోస్..ధర రూ.250

106
dose
- Advertisement -

కరోనాపై పోరాటానికి ఇవాళ్టి నుండి బూస్టర్ డోస్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఓడించేందుకు ఎన్నో చర్యలు చేపట్టిందని ఈ సందర్భంగా తెలిపారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయ.

ప్రైవేటు కేంద్రాల్లో టీకాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని…18 ఏళ్లు నిండిన అందరూ ముందుకు వచ్చి ప్రికాషనరీ డోసు తీసుకుని కరోనాపై పోరును బలోపేతం చేయాలి అని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు దేశ ప్రజలు అందరికీ కరోనా టీకాలను ఉచితంగా అందించగా.. ప్రికాషనరీ డోస్ కు ఆ అవకాశం లేదు. కోవాగ్జిన్, కోవిషీల్డ్ ప్రికాషనరీ డోస్ ధర రూ.250 కాగా, టీకా ఇచ్చినందుకు సర్వీస్ చార్జీ రూ.150 మించకూడదని కేంద్రం స్పష్టం చేసింది.

- Advertisement -