వ్యాక్సిన్ వార్ మొదలైంది…

29
- Advertisement -

ద కశ్మీర్ ఫైల్స్ తో సెన్సేషన్ అయిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి.ఈ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. తాజాగా మరో సంచలన సినిమాతో రానున్నారు వివేక్.

ద వ్యాక్సిన్‌‌ వార్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా అభిషేక్ అగర్వాల్ సమర్పణలో పల్లవి జోషి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లక్నోలో ప్రారంభం కాగా కొవిడ్‌‌ వ్యాక్సిన్‌‌ను కనిపెట్టే క్రమంలో బయో సైంటిస్టులు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ , సక్సెస్‌‌ అన్ని చూపించనున్నారు.

ది కాశ్మీర్ ఫైల్స్ కోసం వివేక్ అగ్నిహోత్రితో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్ తన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దేశవ్యాప్తంగా 11 భాషలలో ‘ది వాక్సిన్ వార్’ని విడుదల చేయనున్నారు. హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, బెంగాలీ, మరాఠీ, తెలుగు, తమిళం, కన్నడ, ఉర్దూ, అస్సామీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఇంగ్లీష్‌‌తో పాటు 11 భాషల్లో దీన్ని విడుదల చేయబోతున్నారు.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్‌‌ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌‌ ప్రొఫెసర్ బలరామ్ భార్గవ రాసిన గోయింగ్ వైరల్‌‌.. మేకింగ్ ఆఫ్‌‌ కో వ్యాక్సిన్‌‌ అనే బుక్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -