‘మిర్చి’ గర్ల్ గుర్తుందా ?… అదేనండి…. రీచా గంగోపాధ్యాయ….సన్నగా… అందంగా… నాజూకుగా ఉన్న ఈ అమ్మాయిని మూడున్నర సంవత్సరాల తరువాత కూడా ఎవరూ మర్చిపోయి ఉండరు. 2010లో లీడర్ సినిమాతో పరిచయమైన ఈ బెంగాలీ భామ తెలుగు తెరపై తన గ్లామర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. నాగవల్లి, మిరపకాయ్, సారొచ్చారు, మిర్చి, భాయ్ లాంటి తెలుగు చిత్రాల్లోనూ మాయక్కం ఎన్నా, వొస్తే అను తమిళ చిత్రాలతో పాటు తన మాతృభాష అయిన బెంగాలీలో బిక్రమ్ సింఘా చిత్రంలోనూ నటించింది.2013 సంవత్సరం నుంచి ఆమె ఒక్క చిత్రంలో కూడా నటించలేదు.
కానీ ఆమె ఫ్యాన్స్ మాత్రం సామాజిక నెట్వర్కింగ్ సైట్లలో మళ్లీ సినిమా ఎప్పుడు చేస్తారూ అని అడుగుతూనే వున్నారు. దీనిపై ఆమె ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. తను సినిమాలకు దూరమై ఐదేళ్లు కావస్తోందనీ, ఇంకా సినిమాల్లో ఎలా నటిస్తారని అనుకుంటున్నారంటూ ప్రశ్నాస్త్రం సంధించింది. ఇప్పుడు తాను కొత్త జీవితంలోకి అడుగుపెట్టాని, అందులో నటన అనే అంశమే లేదని ఆమె సృష్టం చేశారు. గూగుల్‌లో వెతికితే పరిస్థితి ఏంటో మీకే అర్థమవుతుంది అంటూ పలు ట్వీట్స్ పోస్ట్ చేసిందామె.
దీంతో రీచా ఫిలిం ఎగ్జిట్ గురించి తెలియని వారికి మరోసారి క్లారిటీ వచ్చినట్టయింది. ఈ స్వప్న సుందరి, కలల రాకుమారి మళ్ళీ తెర మీదకు రాకపోతుందా అని ఎదురుచూస్తున్న వేళ తానిక తారను కాదంటూ, వేరే వృత్తిలో ఉన్నానంటూ స్వీట్ గా సమాధానం చెప్పడంతో రీచా అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.