ఆ…. సినిమాల్లో నటించే ప్రసక్తే లేదు..!

272
I will never do horror movies
- Advertisement -

వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్న హీరో నాని. నేచురల్‌ స్టార్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నాని…అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకంటున్నాడు. నిన్ను కోరి తర్వాత ప్రస్తుతం నాని నటిస్తున్న చిత్రం ఎంసీఏ(మిడిల్ క్లాస్ అబ్బాయి).  ఓ వైపు లవర్ బాయ్ పాత్రలతో దూసుకుపోతున్న నాని.. ఈ సినిమాలో పక్కా మిడిల్‌ క్లాస్‌ అబ్బాయిగా అలరించనున్నాడు.

ఓ వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సహచర హీరోల ఆడియో, ప్రి రిలీజ్ ఈవెంట్లకు హాజరవుతున్నాడు. సిద్దార్థ్ హీరోగా, నిర్మాతగా తెరకెక్కిన ‘గృహం’కు సంబంధించిన వేడుకలో పాల్గొన్న ఈ నేచరల్ స్టార్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.  నువ్వెప్పుడు హార్రర్ సినిమా చేస్తావు అంటూ సిద్ధు అడగగా   ఏ జానర్ సినిమాలైనా చేస్తా కానీ హార్రర్ సినిమాలు మాత్రం చెయ్యనే చెయ్యనంటూ కుండబద్దలు కొట్టాడు.

నాకు హార్రర్ సినిమాలు చాలా ఇష్టం. ఈ జానర్లో బోలెడన్ని సినిమాలు చూశా. ఐతే నాకు హార్రర్ సినిమాల్లో అత్యంత నచ్చేవి సస్పెన్స్.. థ్రిల్. తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠతో సినిమా చూడటం నాకెంతో ఇష్టం. థియేటర్లో ఆ భయాన్ని ఆస్వాదిస్తూ సినిమా చూస్తా. కానీ మనం హార్రర్ సినిమా చేస్తే ఆ థ్రిల్ అంతా పోతుందని అందుకే చేయనని తెలిపాడు.  వేరే వాళ్లు చేసిన హార్రర్ సినిమాలతో థ్రిల్లవడమే నాకిష్టమన్నా నాని.. లవ్ స్టోరీల్లో  ముందే కథ తెలిసినా ఇబ్బంది ఉండదని… మామూలుగా సినిమా చేసుకెళ్లిపోతాం  అన్నాడు.

ఎంసిఏ సినిమా సెట్స్ పై ఉండగానే నాని  కృష్ణార్జున యుద్ధం  సినిమా షూటింగును కూడా కానిచ్చేస్తున్నాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా తరువాత నాని .. కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -