ఇలియానా పెళ్లి చేసుకుంది …

312
ileana-d-cruz-
- Advertisement -

దేవదాస్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది గోవా బ్యూటీ ఇలియానా. సన్నజాజి తీగ నడుముతో ఎంతోమంది యువకుల హృదయాలని దోచేసిన ఈ భామ తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఓ దశాబ్దం పాటు కొనసాగింది. టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. గత కొంతకాలంగా ఈ భామ ఆస్ట్రేలియా ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫొటోలు ఇప్పటికే నెట్ లో దర్శనమిచ్చాయి.

Illeana-Rumor

అయితే ఆండ్రూతో ప్రేమలో మునిగితేలుతున్న ఇలియానా..లవ్ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకున్నట్లు గాసిప్స్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇలియానా ఆస్ట్రేలియాలో తన స్నేహితుల సమక్షంలో ప్రియుడు ఆండ్రూను వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆండ్రూ అంటే తనకెంతో ఇష్టమని..తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఇలియానా గతంలో చెప్పిన మాటలు..పెళ్లి వార్తలకు మరింత బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే మీడియాతో తమ రిలేషన్ షిప్ గురించి షేర్ చేసుకున్న ఇలియానా మరి పెళ్లి విషయంపై కూడా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

- Advertisement -