ష‌కీలా బ‌యోపిక్‌లో రిచా ఫ‌స్ట్ లుక్..!

342
Shakeela Biopic
- Advertisement -

షకీలా జీవితం ఆధారంగా ఇంద్ర‌జిత్ లంకేశ్ ద‌ర్శ‌క‌త్వంలో ష‌కీలా బ‌యోపిక్ తెర‌కెక్కుతుంది. ఈ చిత్రంలో రిచి చద్దా లీడ్ రోల్ పోషిస్తుంది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లోని తీర్ధ హల్లి అనే ప్రాంతంలో సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. అయితే ష‌కీలా పాత్ర పోషిస్తున్న రిచా చ‌ద్ధా ఈ చిత్రంలో త‌న పాత్రకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను రివీల్ చేసింది. కేర‌ళ సంప్ర‌దాయం ప్ర‌కారం కసవ ప‌ట్టు చీర‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన రిచా త‌న లుక్‌తో యూత్‌ను ఆక‌ట్టుకుంది. ఈ చిత్రం ద్వారా ఓ సాధారణ యువతి స్థాయి నుంచి పాపులర్ ఆడల్ట్‌ స్టార్ గా షకీలా ఎదిగిన తీరును చూపించబోతున్నారు.

Shakeela Biopic

అయితే ఈ బయోపిక్‌లో న‌టిస్తున్న రిచా స్వ‌యంగా ష‌కీలాను క‌లిసి ఆమె జీవితంలో జరిగిన సంఘటనల గురించి తెలుసుకుంది. షకీలా పాత్ర‌లో న‌టించ‌డం నాకు ఓ సవాలు అని తెలిపింది రిచా‌. ఈ సినిమా వ‌ల‌న న‌టిగా సంతృప్తి చెందుతున్నాను. మలయాళ నటుడు రాజీవ్‌ పిళ్లై ఈ సినిమాలో షకీలా ప్రేమికుడు అర్జున్ అనే పాత్ర‌లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో న‌టించిన ష‌కీలా బ‌యోపిక్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.

- Advertisement -