డీలిమిటేషన్ పూర్తయితే సుమారు 75 మంది మహిళలు శాసనసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు.. తమ ప్రభుత్వంలో ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలను కేంద్రబిందువుగా ఉంచామని చెప్పారు.
మహిళా సాధికారతకు బాట వేసింది తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. మహిళలకు ఆస్తిలో హక్కును తొలి సారి ఎన్టీఆర్ కల్పించారని గుర్తు చేశారు.మా పాలనలో తొలిసారిగా విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అందించాం అన్నారు.
దీపం-2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని.. ఆడపిల్ల పుట్టినప్పుడు రూ.5,000 ఫిక్స్‌డ్ డిపాజిట్ అందించాం అన్నారు. పసుపు,కుంకుమ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.9,689 కోట్లు అందించాం అన్నారు.డ్వాక్రా మహిళలు రూపాయి పొదుపు చేస్తే, ప్రభుత్వంగా మేము కూడా రూపాయి సహాయం చేశాం అని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా, అమరావతి కోసం స్వచ్ఛందంగా 34 వేల ఎకరాలు ఇచ్చారు అని తెలిపారు చంద్రబాబు.
Also Read:ప్రజల తరపునే వైసీపీ పోరాటం: జగన్

