Bigg Boss 7 Telugu:షకీలా ఎలిమినేట్

22
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా రెండోవారం పూర్తి చేసుకోంది. రెండో వారంలో అంతా ఊహించినట్లుగానే ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న షకీలా ఎలిమినేట్ అయ్యారు. షకీలా ఎలిమినేట్ అవడంతో అంతా బాగా ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా హౌస్‌లో ఎప్పుడూ షకీలా పక్కనే అమ్మా అమ్మా అంటూ తిరిగే తేజ ఏడ్చేశాడు. ఇక స్టేజీ మీదకు వచ్చిన షకీలా నా కొడుకు తేజను బాగా చూసుకోండి.. బాగా ఫుడ్ పెట్టండి.. నా గుడ్డు కూడా వాడికే వేసేయండి అంటూ సరదాగా మాట్లాడారు. చివరగా దామిని అమ్మ సాంగ్ పాడటంతో కంటతడి పెట్టారు షకీలా. తర్వాత అందరికి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు.

ఇక అంతకముందు సన్‌ డే ఫన్‌ డేలో భాగంగా ఇంటి సభ్యులను అలరించారు నాగ్. వినాయకుడి విగ్రహంతో ఎంట్రీ ఇచ్చిన నాగ్‌.. ఇక పవరాస్త్రను ఎవరూ దొంగతనం చేయకూడదు.. ఇది బిగ్‌బాస్ రూల్ అని తెలిపారు. ఆ తర్వాత హౌస్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ దృష్టిలో వెన్నుపోటు పొడిచే కట్టప్ప ఎవరు? డేంజరస్ శత్రువు భల్లాల దేవుడు ఎవరో చెప్పాలంటూ ఓ గేమ్ మొదలుపెట్టించారు. ఇక ఇందులో ఎక్కువమంది టేస్టీ తేజని కట్టప్పగా చెప్పారు. గేమ్ ఆడిస్తూనే మధ్యలో నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో ప్రిన్స్‌ యావర్ సేఫ్ అని ప్రకటించారు.

ఆ తర్వాత స్క్రీన్‌పైన ఫేస్ కనిపించకుండా కొంతమంది హీరోల పోస్టర్లు చూపించారు. ఆ హీరో పేరు లేదా సినిమా పేరు చెప్పాలన్నారు. మహాబలి టీమ్ రణధీర టీమ్ ఇందులో పోటీ పడ్డారు. అయితే ఇందులో మహాబలి టీమ్ భారీ తేడాతో గెలిచింది. దీంతో వాళ్లకి లగ్జరీ బడ్జెట్ ఇస్తూ జీడిపప్పు, చికెన్, పెరుగు, నెయ్యి, వంట సామాన్లు అందించారు.అలా ఒక్కో సభ్యుడిని సేవ్ చేస్తూ వచ్చారు. చివరగా టేస్టీ తేజ, షకీలా మిగలగా షకీలా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు.

Also Read:KCR: గణనాథుడి ఆశీస్సులతో సుభిక్షంగా తెలంగాణ

- Advertisement -