హ్యాపీ బర్త్ డే….కవితక్క

278
kavitha mlc
- Advertisement -

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం అనేక ఉద్యమాలు నడపడంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఘనత ఆమెది.తెలంగాణ సంస్కృతి, సంప్రాదాయాలను ప్రజలకు వివరించేందుకు తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించిన సూత్రధారి.అతి పిన్నవయసులోనే ఎన్నో ఉద్యమాలను నిర్వహించి, ప్రజాదారణ పొందిన ప్రజావాణి ఆమె.తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనకై..కృషి చేసి..ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం నిత్యం పాటుపడుతున్న అలుపెరగని బాటసారి..కల్వకుంట్ల కవిత.

1978లో మార్చి 13న కరీంనగర్ లో పుట్టారు కవిత. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన కవితక్క 2004 నుండి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమాలు విజయం సాధించాలంటే అది సాంస్కృతిక రూపంలో కూడా ఐక్యత సాధించాలన్న ఉద్దేశంతో “తెలంగాణ జాగృతి సంస్థ”ను స్థాపించి తెలంగాణ పండుగలను విశ్వ వ్యాప్తంచేశారు. మరుగున పడిన బతుకమ్మ పండుగ ఈ రోజు బిగ్గెస్ట్ ఫ్లోరల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాగా కొనియాడబడిందంటే అది కవిత ఘనతే అని చెప్పుకోవాలి.

అంతేకాకుండా మహిళ సంక్షేమ పథకాలకోసం గళం విప్పి, ప్రతి రంగంలోనూ మహిళలు తమదైన ముద్రవేయాలని ఆకాంక్షించారు కవిత. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సైతం పార్లమెంట్‌ లో అనర్గళంగా మాట్లాడిన కవితను చూసి ఆశ్చర్యపోయారు. పార్లమెంట్‌ లో గళంవిప్పి ప్రజావాణిని వినిపించిన కవితను అభినందించనివారు లేరు అంటే..అతిశయోక్తికాదు.

సీఎం కేసీఆర్‌ ఉపన్యాసం వినడానికి జనం ఎలా తరలివస్తారో..కవిత ఉపన్యాసాలు కూడా జనాల్లో నూతన ఉత్సాహాన్ని కలిగించే విధంగా ఉంటాయని, కేసీఆర్‌ లా కవిత కూడా తనదైన శైలిలో జనాల్ని ఆకర్షించగలదని అందరి అభిప్రాయం. ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్న కవిత..తండ్రికి తగ్గ తనయురాలిగా జనంకోసం తన గళాన్ని విప్పుతూ..ప్రజల ఆశిస్సులలో ముందుకుసాగాలని greattelangaana.com మనస్పూర్తిగా కొరుకుంటోంది.

Also Read:Pawan:ఇంకెన్ని త్యాగాలు.. సేనాని?

- Advertisement -