పొటాటో జ్యూస్‌తో ఆ సమస్యలు దూరం..!

37
- Advertisement -

ప్రతిఒక్కరు అత్యంతా విరివిగా ఉపయోగించే కూరగాయలలో పొటాటో అనగా బంగాళదుంపలు ముందు వరుసలో ఉంటాయనే చెప్పవచ్చు. పొటాటో కర్రీ, పొటాటో వేపుడు, పొటాటో చిప్స్.. ఇలా మన ఎంతో ఇష్టంగా తినే ఆహార పదార్థాలలో పొటాటో తప్పనిసరిగా ఉంటుంది. అయితే పొటాటో జ్యూస్ గురించి మాత్రం చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిఉంటుంది. పొటాటో జ్యూస్ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. .

పొటాటోలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల వాటిని చిప్స్ రూపంలో తినడం కన్నా జ్యూస్ రూపంలో సేవిస్తేనే సరిగ్గా శరీరానికి అందుతాయట. అందువల్ల బాడీలోని ఫ్రీరాడికల్స్ ను ఎదుర్కొనే శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా పొటాటోలో పొటాషియం మెండుగా ఉంటుంది. అంతే కాకుండా కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి మూలకాలు కూడా ఉంటాయి. కాబట్టి మన శరీరానికి కావలసిన అన్నీ పోషకాలు పొటాటో జ్యూస్ లో లభిస్తాయట. పొటాటో జ్యూస్ ను ప్రతిరోజూ ఉదయం తాగడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దురమౌతాయి.

ఇంకా నాడీ వ్యవస్థను పని తీరును కూడా మెరుగు పరుస్తుందట. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉన్నవాళ్ళు కచ్చితంగా పొటాటో జ్యూస్ తాగాలని నిపుణులు చెబుతున్నారు. పొటాటోలో నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది అలాగే ఫైబర్ మిశ్రమం. అందుకే ఎలాంటి జీర్ణాశయ సమస్యలకైనా పొటాటో జ్యూస్ చెక్ పెడుతుందని పరిశోదనల్లో వెల్లడైంది. ఇంకా కీళ్ల సంబంధిత సమస్యలతో బాధ పడేవాళ్ళకు పొటాటో జ్యూస్ ఉపశమనాన్ని ఇస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. పొటాటోలో ఉండే ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి, బి కాంప్లెక్స్ కారణంగా శరీరంలో కొలెస్ట్రాల్ శాతం సమస్య ఉండదు. కాబట్టి వారంలో ఒకటి లేదా రెండు సార్లు పొటాటో జ్యూస్ తాగితే పలు అనారోగ్య సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నా మాట.

Also Read:తమన్నాకి ఇది చివరి అవకాశమే

- Advertisement -