రూ.4.21 కోట్లతో బల్కంపేట ఆలయ అభివృద్ధి పనులు

30
- Advertisement -

తెలంగాణలోని హైదరాబా బల్కం పేట రేణుకా ఎల్లమ్మ దేవాలయ ఆలయ అభివృద్ధి పనులకు డబ్బులను రిలీజ్ చేసింది కేంద్రం. ఈ పనులు పీఆర్‌ఏఎస్‌హాడ్ (PRASHAD) పథకం కింద చేపట్టనున్నట్లు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు.

రూ. 4.21 కోట్లు వ్యయంతో, 200 మందికి పైగా ఒకేసారి భోజనం చేసేలా ఆధునిక సౌకర్యాలతో కూడిన మూడు అంతస్తుల అన్నదాన భవనాన్ని ఈ ప్రాజెక్ట్ ద్వారా అభివృద్ధి చేయనున్నారు.

ప్రతి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ, మన దేశపు ఆధ్యాత్మిక వాతావరణాన్ని బలోపేతం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి కృతజ్ఞతలు తెలిపారు షెకావత్.

 

Also Read:ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం

- Advertisement -