రిపబ్లిక్‌ డే…కొండా సర్‌ప్రైజ్

89
konda
- Advertisement -

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం కొండా. కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి జీవిత చరిత్రపై ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇప్పటికే మెజార్టీ షూటింగ్‌ పూర్తయింది. తాజాగా రిపబ్లిక్ డే కానుకగా సినిమా ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్నారు.

జనవరి 26th, రిపబ్లిక్ డే రోజు ఉదయం 10గంటల 25 నిముషాలకి విడుదల కాబోతోంది. ఈ ఖచ్చితమైన సమయం నిర్ణయించడం వెనుక ఉన్న ఒకే ఒక్క కారణం ఏమిటంటే, యెన్నో సంవత్సరాల క్రితం సరిగ్గా జనవరి 26th, రిపబ్లిక్ డే రోజున 10గంటల 25 నిముషాలకి కొండా మురళి పైన వంచనగిరిలో, హత్య ప్రయత్నం జరిగింది…కొండా బ్రతికి పోయినప్పటికి, ఆ దాడికి సంబందించిన కొన్ని బుల్లెట్ లు ఇప్పటికీ ఆయన శరీరంలోనే ఉండి పోయాయి. ఆ బుల్లెట్‌లకి ముందు కథ, వాటి తర్వాత కథే, మా కొండా కథ.. అంటూ వర్మ తన వాయిస్ ఓవర్ ద్వారా తన సినిమా అప్డేట్ ని సోషల్ మీడియా లో ప్రేక్షకులతో పంచుకున్నారు.

- Advertisement -