కోలీవుడ్ హీరో ధనుష్‌కు కరోనా

94
dhanush
- Advertisement -

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడగా తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ కరోనా బారిన పడ్డారు. దీంతో ధనుష్ నటిస్తున్న సార్ చిత్రానికి బ్రేకులు పడ్డాయి.

కొద్ది రోజులుగా ధనుష్ అనారోగ్యంతో బాధపడుతుండగా.. కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ అని తేలింది. వెంటనే షూటింగ్ ఆపేశారు. ప్రస్తుతం ధనుష్ ఐసోలేషన్ లో ఉన్నారు. వారం, పదిరోజుల వరకూ ఆయన షూటింగ్ లో పాల్గొనే ఛాన్సే లేదు.

ప్రస్తుతం ధనుష్… వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం సార్‌లో నటిస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాగా ధనుష్‌కు కరోనా రావడంతో సినిమా షూటింగ్‌కు బ్రేక్‌లు పడ్డాయి. ఎక్కువ సీన్స్ ధనుష్ మీదే ఉండడంతో ఆయన పూర్తిగా కోలుకొనే వరకూ ‘సార్’ చిత్రీకరణ ముందుకు సాగేలా కనిపించడం లేదు.

- Advertisement -