నిజమే…మరో వారంలో రూ.200 నోట్లు..

216
Reserve Bank of India to introduce Rs 200 notes beginning September
- Advertisement -

త్వరలో కొత్త రూ.200 చలామణిలోకి రానున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవముందని దృవీకరించింది కేంద్రప్రభుత్వం. కొత్త కరెన్సీ  భార‌తదేశ చరిత్ర‌లో సెప్టెంబర్‌ మొదటి వారంలో కొత్త రూ.200 నోట్లను రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా చలామణిలోకి తీసుకు రానుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్రించి సిద్ధం చేసిన సరికొత్త రూ. 200 నోట్లు మరో వారంలో చెలామణిలోకి రానున్నాయి.

 Reserve Bank of India to introduce Rs 200 notes beginning September

ఈ కరెన్సీని నెలాఖరులోగా లేకుంటే సెప్టెంబర్ మొదటి వారంలో బ్యాంకులకు అందిస్తామని ఆర్బీఐ వర్గాలు వెల్లడించాయి.  ఆపై బ్లాక్ మార్కెటింగ్ జరుగకుండా అన్ని చర్యలూ తీసుకుని రూ. 50 కొత్త కరెన్సీని కూడా విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు.

 Reserve Bank of India to introduce Rs 200 notes beginning September

ఇండియాలో ఇప్పటివరకూ రూ. 100, రూ. 500 మధ్య ఎలాంటి ఇతర డినామినేషన్ నోట్లూ లేవన్న సంగతి తెలిసిందే.  ప్రజలు ఎదుర్కొంటున్న చిల్లర సమస్యలను ఇవి తీరుస్తాయని స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ ముఖ్య ఆర్థికవేత్త సౌమ్య కాంతి ఘోష్ అంచనా వేశారు.

తొలిసారిగా ఆర్బీఐ రూ. 2000 నోట్లను మార్కెట్లోకి విడుదల చేసిన వేళ, బ్లాక్‌ మార్కెటింగ్‌ జరిగినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త కరెన్సీ విడుదల సమయంలో అవే తరహా పొరపాట్లు జరగకుండా చూడాలన్నది ఆర్బీఐ అభిమతంగా తెలుస్తోంది.

- Advertisement -