అఖిల్‌కు ‘హలో’ చెప్పిన అగ్రహీరోలు…

196
Hello the title for Akhil Akkineni
- Advertisement -

అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తోన్న రెండో చిత్రానికి ‘హలో!’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ‘మనం’ ఫేమ్‌ విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్‌ కుమార్తె కల్యాణి ప్రియదర్శన్‌ నాయికగా పరిచయమవుతోంది.

అగ్రహీరోలతో సినిమా టైటిల్ పేరు చెబుతు విషెస్‌ చేసిన వీడియోని అఖిల్ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.మొదట మూడు అంకెలు లెక్కపెట్టి, ‘హలో!’ అని ఎన్టీఆర్‌ అనగా, తర్వాత వరుసగా కాజల్‌ అగర్వాల్‌, ప్రభాస్‌, శ్రుతి హాసన్‌, నాగచైతన్య, రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, సమంత, సూర్య, నాని, వెంకటేశ్‌, రాజమౌళి, రకుల్‌ప్రీత్‌, రానా ‘హలో!’ అని చెప్పారు.

తర్వాత నాగార్జున ‘‘ఆర్‌ యు రెడీ.. నాన్నా! మీరే చెప్పండి’’ అనగానే ‘ఇద్దరు మిత్రులు’ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు ‘హలో.. హలో..’ అంటూ పాట పాడటాన్ని చూపించారు. గమనించాల్సిన విషయమేమంటే ‘హలో!’ అనే మాటతో హీరోయిన్‌ కల్యాణికి కూడా సంబంధం ఉండటం. ‘నిర్ణయం’ను రూపొందించింది ఆమె తండ్రి ప్రియదర్శనే. డిసెంబర్‌ 22న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

- Advertisement -