జోరు పెంచిన కాజల్..

483
Kajal-Agarwal
- Advertisement -

చందమామని మించే అందం కాజల్ సొంతం. తన చక్కనైన రూపం, అభినయంతో సౌత్ లో టాప్ హీరోయిన్ గా పాతుకుపోయింది. కాగా కొత్త తరం హీరోయిన్లు వస్తుండడంతో సాధారణంగా పాత హీరోయిన్ల ప్రభావం తగ్గుతుంది. కాజల్ పైకూడా ఆ ప్రభావం పడిందని అంతా భావించారు. కొన్ని రోజుల క్రితం వరకు కాజల్ కెరీర్ డల్ అయినట్లు కనిపించింది. అదే సమయంలో కూడా కాజల్ ని పరాజయాలు పలకరించాయి. ఇక సౌత్ లో కాజల్ కెరీర్ తగ్గుముఖం పట్టిందని అంతా భావించారు.

అయితే ఒక్కసారిగా కాజల్‌ నటించిన వరుస సినిమాలు హిట్‌ కావడంతో ఈ అమ్మడు రేంజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటోంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో విజయాన్ని అందుకున్న కాజల్‌, ఈ ఏడాది సంక్రాంతికి ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమాతో బంపర్‌ హిట్‌ సొంతం చేసుకున్న విషయం విదితమే. అలా ఈ ఏడాది ‘వివేకం’ సినిమాతో తన ఖాతాలో హ్యాట్రిక్‌ హిట్‌ నమోదవుతుందన్నది కాజల్‌ గట్టిగానే నమ్ముతోంది. ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘వివేకం’ సినిమాలో కాజల్‌తోపాటు మరో హీరోయిన్‌ కూడా వుంది. ఆమే అక్షర హాసన్‌.

ఇక, ఈ సినిమా గురించి కాజల్‌ మాట్లాడుతూ, ‘వివేకం’ తన కెరీర్‌లోనే వెరీ వెరీ స్పెషల్‌ ఫిలిం అవుతుందని చెప్పుకొచ్చింది. ప్రీ రిలీజ్‌ రిపోర్ట్స్‌ పాజిటివ్‌గా వున్నాయనీ, సినిమా ఖచ్చితంగా ఘనవిజయం సాధిస్తుందని అంటోంది కాజల్‌.   ప్రస్తుతం కాజల్ చేతినిండా సినిమాలు ఉన్నాయి. అజిత్ సరసన నటించిన వివేకం చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. తమిళ్ లో విజయ్ సరసన ఓ చిత్రం లో నటించనుంది. ప్రస్తుతం తెలుగులో కళ్యాణ్ రామ్ ఎమ్మెల్యే చిత్రంలో కూడా కాజల్ హీరోయిన్. ఈ లెక్కన మరి కొంతకాలం పాటు కాజల్ హవా కొనసాగనుందని అంచనా వేస్తున్నారు.

- Advertisement -