వారం తర్వాత కలుస్తాః రేణు దేశాయ్

253
Renu deshai

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు తన అనుభవాలను అభిమానులతో పంచుకుంటుంది. అప్ప‌ట్లో త‌న నిశ్చితార్ధం ఫోటోల‌తో పాటు ప‌లు విష‌యాల‌ని సోష‌ల్ మీడియా వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. కొంత మంది పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఆమెను తీవ్రపదజాలంతో దూషించారు. అప్పటి నుంచి ఆమె సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉంటుంది. తాజాగా రేణు దేశాయ్ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇన్‌స్టాగ్రామ్‌కి కొద్ది రోజుల పాటు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌కి బాగా అల‌వాటుప‌డ్డాను. అందుకే ఇన్‌స్టాకి కొద్ది రోజుల పాటు బ్రేక్ ఇస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ త‌ప్ప మ‌రే సోష‌ల్ మీడియా నెట్‌వ‌ర్క్‌లో నేను లేను. వ‌చ్చే వారం మ‌ళ్ళీ క‌లుస్తాను. ప్లాస్టిక్, నీటి వాడకాన్ని తగ్గించండి’’ అంటూ పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేణు దేశాయ్ సన్నిహితుల సమాచారం మేరకు ఒక వారం రోజుల పాటు ఫ్యామిలీతో విదేశాలకు వెళ్తుందని అందుకే వారం పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నట్లు తెలిపారు.

https://www.instagram.com/renuudesai/?utm_source=ig_embed