పవన్ జ్ఞాపకాలను గుర్తుచేసిన రేణూ..

85
pawan

లాంగ్ గ్యాప్ తర్వాత తన మాజీ భర్త పవన్ కల్యాణ్ జ్ఞాపకాలను గుర్తు చేశారు సినీ నటి రేణూ దేశాయ్. పవన్ కల్యాణ్ తన కుమారుడు, కుమార్తెను ఒళ్లో పడుకోబెట్టుకుని ఉన్న ఫొటోను రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేయాల్సిన అవసరం ఉందని ఆమె కామెంట్ పెట్టారు. కొన్ని అరుదైన ఫొటోలను తాను ఫోన్ కెమెరాతో తీశానని చెప్పారు.

బద్రి సినిమాలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు జోడిగా నటించిన రేణు తర్వాత ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల వారిద్దరూ విడిపోయి వేరుగా ఉంటున్నారు. పిల్లలిద్దరినీ తన వద్దనే ఉంచుకుని ఒక తల్లిగా ఆమె వారి బాధ్యతలను చూసుకుంటోంది రేణు. ఈ క్రమంలో చాలాకాలం తర్వాత పనవ్ మెమోరీస్‌ను రేణూ గుర్తుచేయడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.