రేణూతో పవన్ కు ప్లస్సా.. మైనస్సా.. ?

361
Renu-desai-pawan-klayn
- Advertisement -

సినిమాల్లో నటించి నిజజీవితంలో పెళ్లి చేసుకున్న హీరోహీరోయిన్లు చాలా మందే ఉన్నారు. అదే కోవలోకి వస్తారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రేణూదేశాయ్. వీరిద్దరు సినిమాల్లోనటించి ఆ తర్వాత  పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఆ తర్వాత వీరిద్దరి జీవితంలో మనస్పర్ధలు రావడంతో విడిపోయి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. అయితే రేణూదేశాయ్ మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోకుండా పవన్ కు దూరంగా ఉంటోంది. అయితే పవన్ , రేణూదేశాయ్ ల అన్యొన్య దాంపత్యాన్ని చూసి మురిసిపోయిన వపన్ అభిమానులు పవన్ కల్యాణ్ రేణూదేశాయ్ నుంచి విడిపోయిన ఇప్పటికీ ఆమెను వదినగానే భావిస్తున్నారు.

Renu-Desai-

అయితే పవన్ నుండి విడిపోయి ఒంటరిగా ఉంటున్న రేణూదేశాయ్ ఈ మద్యనే తాను కూడా మళ్లీ పెళ్లి చేసుకుంటానని ప్రకటన చేసింది. ఈ ప్రకటన తర్వాత ఆమెపై పలువురు పలు రకాల విమర్శలు చేశారు. ఈ విమర్శలకు రేణూ దేశాయ్ కూడా ఘాటుగానే స్పందించింది. పవన్ కల్యాన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చు… ముగ్గురు పిల్లలకు జన్మనివ్వొచ్చు… కానీ తాను మాత్రం రెండోపెళ్లి చేసుకుంటే తప్పా.. అని ఘాటుగా సమాధానం చెప్పింది. అయితే ఈ మద్య రేణూదేశాయ్ ఓ టీవిలో ప్రసారమవుతున్న ఓ డ్యాన్స్ లో జడ్జీగా చేస్తోంది. అయితే రేణూదేశాయ్ టీవీ షోలో పార్టిసిపెంట్ గా చేయడం పవన్ కు ప్లస్సా, మైనస్సా అంటే మైనస్ గానే ఎక్కువగా కనిపిస్తోంది.

Pawan-Kalyan-And-EX-Wife-Renu-Desai

రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని బరిలో నిలుపుతూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న  పవన్ కల్యాణ్ కు ఇప్పుడు రేణూదేశాయ్ చేసిన వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరంగానే మారాయని చెప్పుకొవచ్చు. పవన్ నుండి విడిపోయాక రేణూ దేశాయ్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, ఇటీవల ఆత్మహత్యకు ప్రయత్నించిందనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు ఇవన్నీ పవన్ కు ప్రతికూలంగా మారతాయనే చెప్పుకోవచ్చు.. మొత్తానికి రేణూదేశాయ్ తో పవన్ కు కొత్త చిక్కులు వచ్చాయని పలువురు చర్చించుకుంటున్నారు.

- Advertisement -