కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మక ఆహ్వానం

189
Ktr for Dubai global meet
- Advertisement -

సాంకేతికత ఆధారంగా ఇటు పరిపాలన, అటు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్న మంత్రి కేటీఆర్‌కు మరో ఆహ్వానం అందింది.  దుబాయ్‌లో బిజినెస్ లీడర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో జరిగే ఇండియా-యూఏఈ భాగస్వామ్యకు హాజరై ప్రసంగించాల్సిందిగా నిర్వాహకులు కేటీఆర్‌కు ఆహ్వానం అందజేశారు. ఈ సదస్సు ఈ నెల 30, 31 తేదీల్లో జరగనుంది.

దుబాయ్, యూఏఈ దేశాలతో భారత వాణిజ్య సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సమావేశం జరగుతోంది. ఈ సమావేశంలో  భారత్, గల్ఫ్‌కు చెందిన 800ల మంది ప్రతినిధులు పాల్గొననున్నారు.  ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక వ్యాపార భాగస్వామ్యం, పెట్టుబడులు, పాలసీలు, పర్యాటకం అంశాలపై ప్రసంగించాల్సిందిగా నిర్వాహాకులు కేటీఆర్‌ను కోరారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ పారిశ్రామిక పాలసీలపై మంత్రి సదస్సులో ప్రసంగించనున్నారు.

కేటీఆర్ సారథ్యంలో ఇటీవలె తెలంగాణ ప్రభుత్వం మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డును  దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐటీతో పాటు అన్నిరంగాల్లో కొత్త రాష్ట్రం తెలంగాణ అనతికాంలోనే అద్భుతాలను సృష్టించింది.

- Advertisement -