మరో సంచలనం వైపు జియో…

170

రిలయన్స్ జియో ఇప్పుడు మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది.  అయితే ఇప్పటికే టెలికం రంగంలో ఉచిత మంత్రంతో సంచలనం సృష్టించింది రిలయన్స్. చిత కాల్స్, ఉచిత డేటా అంటూ..క్రేజీ ఆఫర్లతో 10 కోట్ల మందికి పైగా కస్టమర్లను సొంతం చేసుకున్న జియో, వారిని జియో ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ పేరుతో శాశ్వత సభ్యులుగా చేసుకునే టారీప్‌ అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది.
 Reliance Jio laptop with 4G
ఇలా ఇప్పటికే 7 కోట్ల మందికి పైగా కస్టమర్లు ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోగా, మరికొంతమందిని ఆకర్షించేందుకు కొత్త ప్లాన్లతో ముందుకెళ్తోంది. అందుకే ఇప్పుడు ల్యాప్‌టాప్‌లపై దృష్టి పెట్టింది జియో.

4జీ సామర్థ్యం గల ల్యాప్‌టాప్‌లను త్వరలో మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది జియో. యాపిల్‌ సంస్థకు చెందిన 13.3 అంగుళాల మ్యాక్‌బుక్‌ని పోలి రిలయన్స్ జియో ల్యాప్‌టాప్‌ ఉండబోతోందని సమాచారం. అంతేకాకుండా ప్రత్యేకంగా సిమ్‌ స్లాట్‌ కూడా ఉంటుందని తెలుస్తోంది.
 Reliance Jio laptop with 4G
హెచ్‌డీ డిస్‌ప్లేతో పాటు, వీడియో కాలింగ్‌కు వీలుగా హెచ్‌డీ కెమెరా కూడా ఉన్నట్టు టాక్‌. 4జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌, 64 జీబీ వరకూ మెమొరీని పెంచుకునే సదుపాయం, 4జీ, ఎల్‌టీఈ, బ్లూటూత్‌, హెచ్‌డీఎంఐ పోర్ట్‌ సదుపాయం, మైక్రో ఎస్‌డీ కార్డ్‌ స్లాట్‌, రెండు యూఎస్‌బీ పోర్ట్స్‌ ఉంటాయని సమాచారం. ఇప్పటికే టెలికం రంగంలో సంచలనమైన జియో..ఇప్పుడు ల్యాప్‌టాప్‌లతో  ఇంకెంత సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.