మహేశ్ శర్మతో టీఆర్‌ఎస్‌ ఎంపిల భేటి

122
TRS MPs meets union minister Anand Sharma in New Delhi..
TRS MPs meets union minister Anand Sharma in New Delhi..

కేంద్ర ప్రభుత్వ పథకం స్వదేశి దర్శన్ లో భాగంగా 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ టూరిజం సర్కూట్ డెవలప్‌మెంట్ కార్యక్రమాన్ని పెద్దపల్లి నియోజక వర్గంలో చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరామని టీఆర్‌ఎస్ ఎంపీలు బాల్క సుమన్, బిబి పాటిల్, పొంగులేటి శ్రీనివాస్ లు తెలిపారు.

కాళేశ్వరం టెంపుల్, శివారం క్రొకడైల్ సాంక్షనరి, ధర్మపురి, కోటిలింగాల టెంపుల్, గంధారి వనం, ఎల్లంపల్లి ప్రాజెక్టు, బౌద్ధ ఆరామాలు అన్నింటిని కలిసి ఇంటిగ్రేటెడ్ టూరిజం సర్కూట్ డెవలప్‌మెంట్ పథకంలో అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు.

పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇంటిగ్రేటెడ్ టూరిజం సర్కూట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ను కేంద్ర మంత్రికి వివరించామని తెలిపారు. పూర్తి డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్ ను అధికారులకు అందించామన్నారు. దీనిపై మంత్రి చాలా సానుకూలంగా స్పందించారని తెలిపారు. గత ప్రభుత్వాలు తెలంగాణ లో పర్యాటక రంగానికి గుర్తింపును ఇవ్వలేదని… కొత్త రాష్ట్రమైన తెలంగాణకు పర్యాటక రంగంలో కేంద్రం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కోన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అన్ని జిల్లాల్లో పర్యాటక ప్రాంతాలను మా ప్రభుత్వం గుర్తించి, వాటిని అభివృద్ధి చేస్తోందన్నారు.