రూ. 999కే జీయో 4జీ ఫీచర్‌ ఫోన్ !

214
Reliance Jio 4G VoLTE Feature Phone
Reliance Jio 4G VoLTE Feature Phone
- Advertisement -

ఇప్పటికే అతి తక్కువ ధరకే డేటా ప్యాక్స్‌ను, ఉచిత వాయిస్ కాల్స్‌ను అందిస్తున్న రిలయన్స్ జియో.. మరో సంచలనానికి తెరతీసేందుకు సిద్దమౌతోంది. 4జీ సామర్థ్యంతో ఫీచర్ ఫోన్లను లాంచ్ చేయాలని ప్లాన్స్ వేస్తోంది. అతి త్వరలో మార్కెట్లోకి వస్తాయని భావిస్తున్న రిలయన్స్ జియో 4జీ వీఓఎల్టీఈ ఫీచర్ ఫోన్ స్పెసిఫికేషన్ల వివరాలు ఆన్ లైన్లో లీక్ అయ్యాయి. గ్రామీణ భారతావనిలోని ప్రజలను సొంతంచేసుకుని, లక్షల కొలదీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ముఖేష్ అంబానీ ఈ తక్కువ ధర ఫోన్లకు రూపకల్పన చేశారు.

ఈ ఫోన్ లో 2.4 అంగుళాల స్క్రీన్, 512 ఎంబీ ర్యామ్, 4 జీబీ అంతర్గత మెమొరీ, మైక్రో ఎస్డీ కార్డు సదుపాయం, 2 ఎంపీ రేర్ కెమెరా, ముందువైపు వీజీఏ కెమెరా ఉంటాయి. వై-ఫై, ఎన్ఎఫ్సీ, జీపీఎస్ సదుపాయాలుంటాయి. ప్రస్తుత మార్కెట్ ధరతో పోలిస్తే, అతి తక్కువ ధరకు కాల్స్ చేసుకోవచ్చు. అన్ని జియో యాప్స్, 4జీ సిమ్ సదుపాయాలు ఇందులో ఉంటాయి. ఇక మై జియో, జియో టీవీ, జియో సినిమా, జియో మ్యూజిక్ తదితరాలకు డెడికేటెడ్ బటన్స్ ఉంటాయి. రెండు మోడల్స్ లో ఇవి లభ్యం కానుండగా, వీటి ధరలు రూ. 1700 వరకూ ఉండగా, తొలి దశలో సబ్సిడీపై రూ. 999 నుంచి రూ. 1,500 మధ్య విక్రయించాలని ముఖేష్ భావిస్తున్నారు.

4జీ మొబైల్ నెట్‌వర్క్ కనెక్షన్స్ విభాగంలో ఇప్పటికే 10 కోట్ల మార్కును క్రాస్ చేసిన జియో, బ్రాడ్‌బ్యాండ్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టబోతోంది. జియో ఫైబర్ సర్వీసులకు సంబంధించి ఇప్పటికే టెస్టింగ్ ప్రాసెస్ ఇప్పటికే కొన్ని చోట్ల జరుగుతోంది. జియో చేరువచేసే ఫైబర్ సర్వీసులో భాగంగా ఇటు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌తో పాటు అటు డీటీహెచ్ కనెక్షన్ కూడా అందుబాటులో ఉండనుంది. ఇదే జరిగితే  డీటీహెచ్, బ్రాడ్‌బ్యాండ్‌ రంగాల్లో పెనుమార్పులు రావడం ఖాయం.

- Advertisement -