- Advertisement -
కేంద్రమాజీ మంత్రి, సీనియర్ నటుడు కృష్ణం రాజు అనారోగ్యంగా ఉన్నారని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. న్యుమోనియా కారణంగా ఆయనకు శ్వాసకోస ఇబ్బందులు తలెత్తాయని వార్తలు వినిపించాయి. అయితే తాజాగా తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించారు నటుడు కృష్ణంరాజు.
నా ఆరోగ్యం గురించి అభిమానులు ఎలాంటి ఆందోలన చెందాల్సిన అవసరం లేదన్నారు. న్యూమోనియాకు చికిత్స చేయించుకోవడంతో పాటు సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం కేర్ హాస్పిటల్‌కు వెళ్లానని చెప్పారు. కొంత మంది కనీస విషయ సేకరణ, నిర్ణారణ లేకుండా వార్తలు రాశారన్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం చాలా బాగుందని.. పరీక్షలన్నీ పూర్తయ్యాక తిరిగి ఇంటికి వెళ్తానని ఓ ప్రకటన విడుదల చేశారు కృష్ణం రాజు. దీంతో రెబల్ స్టార్ అభిమానులంతా ఉపిరి పిల్చుకున్నారు.
- Advertisement -