RDX మూవీలో RX100 హీరోయిన్..

643
rdx-movie
- Advertisement -

ఆర్ఎక్స్ 100 మూవీలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది పాయల్ రాజ్ పుత్. ఆ సినిమా తర్వాత ఆమె RDX అనే మూవీలో నటించనుంది. సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా సి.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.5 RDX ఆదివారం విజ‌య‌వాడ కె.ఎల్‌.యూనివ‌ర్సిటీలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య‌వాడ అర్బ‌న్ తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు బుద్ధా వెంక‌న్న‌, ఆంధ‌ప్ర‌దేశ్ FDC చైర్మ‌న్ అంబికా కృష్ణ త‌దిత‌రులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ప‌వ‌ర్‌ఫుల్ హీరోయిన్ సెంట్రిక్ కాన్సెప్ట్‌తో శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. అలాగే అవ‌కాయ బిర్యానీ, హుషారు చిత్రాల్లో న‌టించి మెప్పించిన తేజ‌స్ హీరోగా న‌టిస్తున్నారు. ఈసందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ..ద‌ర్శ‌కుడు శంక‌ర్ భాను చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో RDX సినిమా నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌య్యాను. ప‌వ‌ర్‌ఫుల్ లేడీ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్. పాయ‌ల్ రాజ్‌పుత్ పాత్ర అద్భుతంగా.. అంద‌రినీ మెప్పించేలా ఉంటుందన్నారు.

హీరోయిన్ పాయల్ మాట్లాడుతూ..RX 100` త‌ర్వాత మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర చేస్తున్నాను. ఇది లేడీ ఓరియెంటెడ్ స‌బ్జెక్ట్‌. డైరెక్ట‌ర్ శంక‌ర్ భానుగారు నా పాత్ర‌కు అద్భుతంగా డిజైన్ చేశారు. ఆయ‌న నెరేష‌న్‌, పాత్ర తీరు తెన్నులు న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పేశాను. నా పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుందన్నారు.

- Advertisement -