రికార్డ్ స్కోర్ చేసిన సన్ రైజర్స్ ..

605
WARNER-IPL
- Advertisement -

ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పరుగుల సునామిని సృష్టించింది సన్ రైజర్స్ హైదరాబాద్. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణిత 20 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్ ఆకాశమే ఇద్దరూ సెంచరీలు చేసి రికార్డు సృష్టించారు. బెయిర్‌స్టో 52 బంతుల్లో 114 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ 55 బంతుల్లో 100పరుగులు చేశారు. 114పరుగులు చేసిన బెయిర్ స్టో నాటౌట్ గా నిలిచాడు.

బెయిర్ స్టో, వార్నర్ బాధుడికి బెంగుళూరు బౌలర్లు షాకయ్యారు. మరోవైపు వార్నర్ సైతం ఉతికారేయడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎక్కడ ఫీల్డింగ్ పెట్టాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచుల్లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన జోడిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసిందీ జోడి. ఐపీఎల్‌లో వార్నర్‌కు ఇది నాలుగో సెంచరీ. షేన్ వాట్సన్, విరాట్ కోహ్లీలతో కలిసి అత్యధిక సెంచరీలు చేసిన రెండో క్రికెటర్‌గా నిలిచాడు వార్నర్. కొత్త బౌలర్ ప్రయాస్ రే బర్మన్ అయితే తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 56 పరుగులు ఇచ్చాడు. భారీ లక్ష్యాన్ని బెంగుళూరు ఏవిధంగా ఎదుర్కొంటుందో చూడాలి మరి.

- Advertisement -