లోక్‌సభలో కాంగ్రెస్ నేతగా రవ్ నీత్ సింగ్ బిట్టూ..

204
ravneet singh bittu
- Advertisement -

లోక్‌సభలో కాంగ్రెస్ నేతగా లూధియానా ఎంపీ రన్‌వీత్ సింగ్ బిట్టూ నియమితులయ్యారు. అధిర్ రంజన్ చౌధరి స్థానంలో ఆయన నిమామకం జరిగింది. అధిర్ రంజన్ పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ చీఫ్ గా ఉన్నారు. ఇప్పుడు ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతుండటంతో, ఆయన ప్రచారంలో బిజీగా ఉన్నారు. మరోవైపు లోక్ సభలో కాంగ్రెస్ డిప్యూటీ గౌరవ్ గొగోయ్ కూడా అసోం ఎన్నికల్లో బిజీగా ఉన్నారు. దీంతో, లోక్ సభాపక్ష నేతగా బిట్టూను నియమించారు.

రన్‌వీత్ సింగ్ బిట్టూ మూడు సార్లు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. 2009 లో ఆనందపూర్ సాహిబ్ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత 2014,19 ఎన్నికల్లో లుధియానా నుంచి ఎంపీగా గెలుపొందారు. రన్‌వీత్ సింగ్ బిట్టూ నియామకంపై పంజాబ్ పీసీసీ హర్షం వ్యక్తం చేసింది. ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ మనవడే రవ్ నీత్ సింగ్ బిట్టూ కావడం గమనార్హం.

- Advertisement -