మోడీ సర్కార్‌పై అవిశ్వాసం..అనుమతిచ్చిన స్పీకర్

48
- Advertisement -

మణిపూర్ ఇష్యూపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్ష ఎంపీలు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. దీనిపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అవిశ్వాస తీర్మానం అస్త్రాన్ని సంధించాయి విపక్షాలు. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావుతో పాటు కాంగ్రెస్ ఎంపీ గౌర‌వ్ గ‌గోయ్‌ కేంద్రంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వగా సుమారు 50 మంది ఎంపీలు సంత‌కాలు చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఉదయం సభ ప్రారంభంకాగానే ఉభయసభల్లో ఆందోళన కొనసాగింది. దీంతో పలుమార్లు సభను వాయిదా వేసిన ఫలితం లేకపోవడంతో చివరకు లోక్‌స‌భ‌లో స్పీక‌ర్ ఓం బిర్లా అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ చేప‌ట్టేందుకు అనుమ‌తి ఇచ్చారు. అవిశ్వాస తీర్మానాన్ని గ‌గోయ్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. దానికి స్పీక‌ర్ స్పందిస్తూ త్వ‌ర‌లో చ‌ర్చ తేదీ, స‌మ‌యాన్ని వెల్ల‌డించ‌నున్న‌ట్లు చెప్పారు. దీంతో అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాని ప్రకటన చేస్తారో లేదో వేచిచూడాలి.

Also Read:Nara Rohit:ప్రతినిధి 2 కాన్సెప్ వీడియో

పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు ఆగ‌స్టు 11వ తేదీన ముగియ‌నుంది. విప‌క్ష పార్టీలు ప్ర‌వేశ‌పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చించేందుకు కేవ‌లం 13 రోజులు మాత్ర‌మే ఉండగా ప‌ద్ధ‌తి ప్ర‌కారం అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చను షెడ్యూల్‌ చేసేందుకు లోక్‌స‌భ స్పీక‌ర్ 10 రోజ‌లు స‌మ‌యాన్ని తీసుకునే వీలుంది.

Also Read:Prabhas:మాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్‌..!

- Advertisement -