రవితేజ 71 @ టైగర్ నాగేశ్వర రావు

105
Tiger Nageswara Rao
- Advertisement -

వరుస సినిమాలతో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నారు మాస్ మహారాజా రవితేజ. చేతిలో మూడు సినిమాలు ఉండగానే మరో భారీ ప్రాజెక్ట్ ను ప్రకటించాడు. గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ లో నటించనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ లుక్‌ని రిలీజ్ చేయగా రవితేజ కెరీర్‌లో ఇది 71వ చిత్రం.

అంతేగాదు రవితేజ కెరీర్‌లో ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. ఈ భారీ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా, అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారు. హిందీలో కూడా విడుదల కానున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించనున్నారు. షూటింగ్‌, నటీనటులకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించనున్నారు.

ఇప్పటికే రవితేజ ‘ఖిలాడి’,‘రామారావు ఆన్ డ్యూటీ’ చేస్తున్నాడు. ఈ రెండు సెట్స్ మీద ఉండగానే ‘ధమాకా’ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించేశాడు.

- Advertisement -