రవితేజకు గాయాలు!

31
raviteja
- Advertisement -

హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు హీరో రవితేజ. ఇప్పటికే ఈ మాస్ మహారాజా చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇక తన కెరీర్‌లో రవితేజ మొదటి పాన్ ఇండియా సినిమా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ షూటింగ్ లో బిజీగా ఉండగా ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. నూపుర్‌ సనన్, గాయత్రి భరద్వాజ్‌ హీరోయిన్లుగా, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాణంలో తెరకెక్కుతుంది.

ఇక హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతుండగా భారీ యాక్షన్ సీన్స్‌ను తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ యాక్షన్ సీన్స్ సందర్భంగా హీరో రవితేజ గాయపడ్డారు. ఆయన మోకాలికి గాయమై, పది కుట్లు పడ్డాయని చిత్ర యూనిట్ తెలిపింది. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించినా రవితేజ మాత్రం వినలేదు.

తన కారణంగా షూటింగ్‌ ఆగకూడదు మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

- Advertisement -