పెళ్లి రద్దుపై హీరోయిన్ రష్మిక క్లారిటీ..

427
Rashmika Mandanna Clarifies About Her Marriage Rumours
- Advertisement -

‘గీతా గోవిందం’ హిట్ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతుంది హీరోయిన్ రష్మిక మందన. ఈ అమ్మడు గతేడాది రక్షిత్ శెట్టి అనే కన్నడ హీరోతో ప్రేమలో పడి ఎంగేజ్ మెంట్ కూడా చేసుకుంది. ఆ తరువాత ఈ అమ్మడు వరుస హిట్లతో పాప్యులర్ అయి, అటు కన్నడ, ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలో డిమాండున్న హీరోయిన్‌గా మారింది. ఇటీవల ఈ అందాల భామ రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో రష్మికపై రకరకాల కామెంట్స్‌ చేస్తున్నారు నెటీజన్లు. ఇక తనపై వస్తున్న విమర్శలపై తొలిసారిగా వివరణ ఇచ్చింది.

Rashmika Mandanna

‘అందరికీ నమస్కారం. ఇంతకాలం నా వ్యక్తిగత విషయాల్లో నేను మౌనం వహించినందుకు నన్ను క్షమించండి. నా గురించి ఎన్నో కథలు, వార్తలు, కామెంట్లు, ట్రోల్స్‌ వస్తున్నాయి. అవన్నీ నన్ను తప్పుగా చూపిస్తుండడంతో నేను డిస్టర్బ్‌ అవుతున్నాను. ఈ విషయాలన్నీ చాలా దూరం వెళ్లిపోయాయి. ఇందుకు మిమ్మల్ని వేలెత్తి చూపాలనుకోవడంలేదు. ఎందుకంటే మీరు అలాంటివే నమ్ముతారు. ఈ వార్తల గురించి మీ అందరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు.

Rashmika Mandanna

కానీ మీ అందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. రక్షిత్‌, నేనే కాదు..సినీ పరిశ్రమకు చెందిన ఏ ఒక్కరూ మాలాగా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోకూడదు. ఒక నాణేనికి రెండు ముఖాలు ఉన్నట్లు ప్రతి కథకు రెండు రూపాలు ఉంటాయి. కాబట్టి దయచేసి మా పనిని ప్రశాంతంగా చేసుకోనివ్వండి. నేను కన్నడ సినిమాలు చేస్తూనే ఉంటాను. భాష ఏదైనా నేను ఇదే ఇండస్ట్రీలో ఉంటాను. ధన్యవాదాలు’ అని వెల్లడించారు రష్మిక.

- Advertisement -