దేవదాస్ నుండి ‘హే బాబు’.. సాంగ్

259
- Advertisement -

కింగ్ నాగార్జున‌, నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం దేవదాస్‌. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాని సరసన రష్మిక మందాన, నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికలుగా నటిస్తున్నారు. కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో దేవ్ అనే పాత్రలో డాన్ గా నాగ్, దాస్ అనే పాత్రలో డాక్టర్‌గా నాని కనిపించనున్నారు. సెప్టెంబ‌ర్ 27న విడుద‌ల కానున్న ఈ చిత్రంపై అభిమానుల‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

Devadas Movie

ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్, సాంగ్స్‌కి మంచి స్పంద‌న ల‌భించింది. త్వ‌ర‌లో ట్రైల‌ర్ కూడా విడుద‌ల చేసి సినిమాపై మ‌రింత ఆస‌క్తి క‌లిగించాలని చిత్ర యూనిట్‌ భావిస్తుంది. మ‌ణిశ‌ర్మ స్వ‌ర‌ప‌ర‌చిన సంగీతానికి మంచి స్పందన వ‌స్తుంది. తాజాగా చిత్రం నుండి మ‌రో లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల చేశారు.

హే బాబు అంటూ సాగే ఈ పాట‌కి రామ‌జోగ‌య్య శాస్త్రి లిరిక్స్ అంద‌చ‌గా కార్తీక్‌, ర‌మ్య బెహ్ర క‌లిసి పాడారు. ఈ సాంగ్ సంగీత ప్రియుల‌ని ఆక‌ట్టుకుంటుంది. సీనియర్ నరేష్, రావ్ రమేష్, అవసరాల శ్రీనివాస్, బాహుబలి ప్రభాకర్, వెన్నెల కిషోర్, సత్య మొదలగువారు ఈ చిత్రంలో నటించారు.

https://youtu.be/DvkAzq9AWhA

- Advertisement -