ప్చ్.. రష్మిక డీప్‌ ఫేక్ పై విచారణ?

39
- Advertisement -

రష్మిక మందన్న డీప్‌ ఫేక్ కేసులో నలుగురు అనుమానితులను ఢిల్లీ పోలీసులు గుర్తించారు. అయితే, వారు కేవలం అప్‌ లోడ్ చేసే వారేనని పోలీసులు తెలిపారు. డీప్‌ఫేక్ ప్రొఫైల్‌ ను రూపొందించడానికి కారణమైన ప్రాథమిక కుట్రదారులను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు స్పష్టం చేశారు. సాంకేతికతను దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పుకొచ్చారు. అయితే, పోలీసుల పై కొందరు నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోలోని అసభ్యత కంటే.. యానిమల్ చిత్రంలో రష్మిక మందన్న బ్రాతో ‘హీరో తల’ని తన ఎద భాగం పెట్టుకోవడంలోనే.. ఇంకా ఎక్కువ అసభ్యత ఉందని పోస్ట్ లు పెడుతున్నారు.

రష్మిక మందన్న ఏదో సతి సావిత్రి, సతి అనసూయ లాగా ఆమె గురించి మీరు పోరాటం చేయడం మాకు చాలా బాధను కలిగిస్తోంది. ప్రతి రోజూ కొన్ని వేల మంది ఆడవాళ్లు ఇలాంటి అసభ్యకరమైన వీడియోలతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొందరు ఆ అవమాన భారంతో చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ హీరోయిన్ పై చేసిన ఓ డీప్ ఫేక్ వీడియోకి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు అనేది సగటు సామాన్యుడి ప్రశ్న. నిజానికి రష్మిక మందన్నా మార్ఫింగ్ వీడియో కంటే.. ఆమె చేసే ఎక్స్ పోజింగే ఎక్కువ ఉంటుంది అనేది వాస్తవం. అయినప్పటికీ, రష్మిక మందన్న కోసం ప్రత్యేకమైన టీమ్ ను పెట్టి మరీ, విచారణ చేయడం కామెడీగా ఉంది.

అదే, సామాన్య ఆడవాళ్ల విషయంలో మాత్రం ఇదే అధికారులు చూసి చూడనట్టు ఉంటారు కదా. ఇప్పటికైనా సామాన్య ఆడవాళ్ల కోసం మన అధికారులు పని చేస్తే ఈ సమాజానికి మంచిది. ఈ డీప్‌‌ఫేక్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలోట్రెండ్ అవుతుంది. సంబంధం లేని ఫొటో తీసుకొని దుండగులు AIని ఉపయోగించి మార్ఫ్‌డ్ ఫొటో సృష్టించి కొందరు ఆడవాళ్లను టార్గెట్ చేస్తున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి గానీ, ఇలాంటి వాటిని అరికట్టడానికి సులువైన మార్గాలను కనుకొంటేనే సరైన పరిష్కారం దొరుకుతుంది.

Also Read:ఆ సినీ రచయిత మాట నేటికీ గొప్పదే

- Advertisement -