కిర్తీ సురేష్ నటనపై కామెంట్ చేసిన రష్మిక

308
rashmika mandana
- Advertisement -

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పెంగ్వీన్. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దీనిని నిర్మించారు. ఈ సినిమాలో కీర్తి గర్భిణి యువతిగా నటించింది. ఈమూవీ ఎప్రిల్ మొదటి వారంలో విడుదలకావాల్సి ఉంది. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో ధియేటర్లు మూసి ఉండటంతో విడుదల వాయిదా వేశారు. అయితే ఈమధ్య ఓటీటీలకు బాగా డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. నిర్మాతలకు భారీగా డబ్బులు ఇచ్చి సినిమాలను ఆన్ లైన్ లో విడుదల చేస్తున్నారు.

తాజాగా పెంగ్వీన్ మూవీని కూడా ఆన్ లైన్ లో విడుదల చేశారు. ఈమూవీని చాలా మంది చూస్తున్నారు. తాజాగా ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన ఈసినిమా చూసింది. ఈమూవీ చూసిన తర్వాత కిర్తీ సురేష్ నటనపై ప్రశంసల వర్షం కురిపించింది రష్మిక మందన. రాత్రి పెంగ్విన్ చూశాను.. కీర్తీ, నువ్వు కీలకం.. ఎప్పటిలానే నీ అభినయం అద్భుతం. ఈ సినిమా అందరు తల్లులకూ సంబంధించింది. ఈశ్వర్, సుబ్బరాజు సర్.. అందరికీ అభినందనలు’ అంటూ ట్వీట్ చేసింది. మాములుగా హీరోయిన్లు ఒకరి సినిమా గురించి ఒంకొకరు పెద్దగా మాట్లాడారు. కానీ రష్మిక కిర్తీ సురేష్ నటనపై ఇలా మాట్లాడంతో ఆమెను అభినందిస్తున్నారు నెటిజన్లు.

- Advertisement -