ఫో..ఫో.. ఫోవోయ్,  ఎమ్మెల్యే వైతే నాకేంటి ?   

145
- Advertisement -

‘పుష్ప 2’ కూడా  ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలోనే సాగుతుంది కాబట్టి..  ఈ సినిమాలోని  ఓ కీలక షెడ్యూల్ షూట్ ను కూడా  మారేడుమిల్లి అడవుల్లోనే  ప్లాన్ చేశారు.  అడవిలో షూటింగ్ కాబట్టి.. అన్నీ జాగ్రత్తలు తీసుకుని దర్శకుడు సుకుమార్ షూటింగ్ పెట్టుకున్నాడు. ఐతే, పుష్ప 2 కి ఉన్న క్రేజ్ రీత్యా  జనం లొకేషన్ కి పోటెత్తుతున్నారు. జనాన్ని కంట్రోల్ చేయడానికి  లోకల్ పోలీసుల అవసరం పడింది. పోలీసుల నుంచి గట్టి  సపోర్ట్ కోసం  ఓ ఎమ్మెల్యే గారు మాట సాయం చేశారు. పైగా  షూట్ కి అదనపు పర్మిషన్లు కూడా ఇప్పించారు. ఐతే, యాంకర్ అనసూయ పై  కీలక సీన్స్ ను ప్లాన్ చేస్తున్నారని తెలిసి  సదరు ఎమ్మెల్యే గారు ఉత్సాహంగా సెట్ కి వెళ్ళాడు. అసలే ఎమ్మెల్యే… ఆ హోదాతోనే వచ్చి రాగానే  పుష్ప షూట్ లో హడావుడి మొదలైంది.

ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి యాంకర్ అనసూయ అంటే కాస్త ప్రత్యేకమైన ఇంట్రెస్ట్  ఉన్నట్టుంది. నేరుగా  ఆమెకు ఎదురుగా వెళ్లి కూర్చున్నాడు.  కబుర్లు చెప్పడం మొదలు పెట్టి.. సరదాగా జోకులు దాకా వెళ్ళాడు. ఇక ముచ్చట్లు ముగిశాక,  మట్టసంగా పైకి లేచి అనసూయ ను ప్రేమగా రాత్రికి స్పెషల్  డిన్నర్‌కు ఆహ్వానించాడు. మరి అనసూయను సరదాగానో పిలిచాడో..  లేక, మరో కారణానికి పిలిచాడో…  ఇక్కడ అనసూయ కదా,  వాట్ ?,  ఫో..ఫో.. ఫోవోయ్, నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేంటి..?  అనుకుని బ్లంటుగా ఆయన గారి ఆహ్వానాన్ని  రెఫ్యూజ్ చేసిపారేసింది.

దాంతో సదరు ఎమ్మెల్యే  ఇగో దెబ్బ తింది.  ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు. ఎమ్మెల్యే కి కోపమొచ్చింది.  సుకుమార్ సినిమా షూటింగ్ కి అడ్డంకులు వచ్చి పడ్డాయి. అనుమతి ఉంది కదా అంటే… ఆ అనుమతికి  అనుమతి లేదు అంటూ  బోలెడు షరతులు ముందు వరసలోకి తెచ్చారు.  దాంతోనే,  పుష్ప 2 షూటింగ్ ను మళ్లీ ప్రత్యేకంగా ప్లాన్ చేయాల్సి వచ్చింది.  ప్రస్తుతం టాలీవుడ్ లో  ఈ వ్యవహారం గురించి ప్రముఖంగా  టాక్  నడుస్తోంది. ఇక  పుష్ప 2 కథలో కూడా చాలా కొత్త పాత్రలను   ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు సుకుమార్.  పైగా మునుపెన్నడూ కనిపించని ఊర మాస్ లుక్ లో బన్నీ  కనిపించబోతున్నాడు.

ఇవి కూడా చదవండి…

అరెరే..  ఆ బిల్డప్ ల  జోలికి ఎందుకు పోయినట్టు ? 

ప్చ్..   ఈ ‘వారసుడు’ మజిలీ ఎటువైపు ?

త్వరలో సొంతగూటికి కొండా..?

- Advertisement -