ఆఫ్గన్ గెలుపు..రషీద్ ఖాన్ భావోద్వేగం

66
rasheed khan

ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా స్కాట్లాండ్‌పై ఘన విజయం సాధించింది ఆఫ్గనిస్తాన్‌. బ్యాటింగ్ బౌలింగ్ అన్ని రంగాల్లో రాణించిన ఆఫ్ఘన్‌..స్కాట్లాండ్‌ను మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గనిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 190 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ 10.2 ఓవర్లలో 60 పరుగులకు ఆలౌటైంది. 130 పరుగుల తేడాతో గెలుపొంది టోర్నీలో శుభారంభం చేయగా ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్, రషీద్‌ ఖాన్‌ స్పిన్‌ మాయాజాలంతో అద్వితీయి విజయాన్ని అందుకుంది.

ఈ సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు రషీద్ ఖాన్. గొప్ప ఆరంభం.. ప్రతి ఒక్కరికి.. ముఖ్యంగా దేశ ప్రజలకు అభినందనలు. ఈ గెలుపు మీ ముఖాలపై చిరునవ్వులు పూసేందుకు.. పండుగ చేసుకునేందుకు కారణమవుతుందని ఆశిస్తున్నా అని పేర్కొన్నారు. తాలిబన్ల పాలనలో దేశంలో నెలకొన్న అనిశ్చితితో సతమవుతున్న ప్రజలకు తమ గెలుపు కాస్త ఊరట కలిగిస్తుందని పేర్కొన్నాడు.

ప్రపంచ వేదికపై తాము సాధించిన విజయం దేశ ప్రజలకు గర్వకారణమంటూ ఉద్వేగానికి లోనయ్యాడు.