త్రిష..బ్రింద షురూ

31
trisha

అందం,అభినయం రెండు కలబోసిన సౌందర్య శిల్పం త్రిష. తన అందాల వర్షంలో ప్రేక్షకులని తడిపి ముద్దచేసిన మనోహరి. మోడలింగ్ రంగం నుంచి వెండితెరపై తళుక్కుమన్న ఈ చెన్నై బ్యూటీ తెలుగు,తమిళ్‌ ఇండస్ట్రీలో అగ్రహీరోల సరసన నటించి మెప్పించింది. అయితే కొద్దికాలంగా వెండితెరకు దూరమైన త్రిష తాజాగా ఓటీటీలో అలరించనున్న సంగతి తెలిసిందే.

ఆమె నటిస్తున్న ఫస్ట్ వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం అయీంది. ‘బ్రింద’ అనే టైటిల్‌తో ఇది తెరకెక్కనుండగా..కొత్త దర్శకుడు సూర్య వంగల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌ను అవినాష్ కొల్ల – ఆశీష్ కొల్ల కలిసి నిర్మిస్తున్నారు. సోనీ లీవ్‌లో ఇది స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.

జై కృష్ణ ఈ వెబ్ సిరీస్‌కు మాటలు అందిస్తున్నారు. పద్మావతి మల్లాదితో కలిసి సూర్య వంగల స్క్రీన్ ప్లే రాసుకున్నారు. శశాంక్ వెన్నెలకంటి స్క్రిప్ట్ కన్సల్టెంట్‌గా వ్యవహరించారు. సాయి కుమార్, ఆమని, ఇంద్రజిత్ సుకుమారన్, రవింద్ర విజయ్, ఆనంద్ సామి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతోన్నారు.