వేములవాడలో నాగుపాముల హల్ చల్..

39
cobras

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్‌లోని పసుల లక్ష్మీనారాయణ ఇంట్లోకి రెండు నాగుపాములు వచ్చి హల్ చల్ చేశాయి. సుమారు 15 ఫీట్ల పొడవు ఉన్న నాగు పాములను చూసి కాలనీవాసులు ఆందోళన చెంది భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో కాలనీవాసులు భయంతో పరుగులు తీశారు. పాములు పట్టే అతని పిలిపించి బిందెలో పాములను బంధించి రెండు నాగు పాములను పట్టుకెళ్ళడంతో కాలనీ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.