కేటీఆర్‌ను కలిసిన ఎస్సీ ఎస్టీ కమీషన్ సభ్యులు..

25

ఎస్సి ఎస్టీ కమీషన్ చైర్మన్ డా ఎర్రోళ్ల శ్రీనివాస్ నేతృత్వంలో కమీషన్ సభ్యులు ఈ రోజు ప్రగతి భవన్‌లో మంత్రి కల్వకుంట్ల తారక రామారావును కలిశారు. ఈ సందర్భంగా మంత్రికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ నెల 5,6, మరియు 7 తేదీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నిర్వహించబోయే జన అదాలత్ పోస్టర్‌ను మంత్రీ కేటీఆర్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్ గారు , రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్ గారు, కమీషన్ మెంబెర్స్ విద్యాసాగర్ గారు, రాంబల్ నాయక్ గారు, నీలాదేవి గారు పాల్గొన్నారు.