‘రంగస్థలం’ పేరుతో రెస్టారెంట్‌..

76
Rangasthalam Restaurant in Hyderabad

ఏదైన ఓ సినిమా ఎక్కువ‌గా జ‌నాల నోళ్ళ‌ల్లో నానుతుంది అంటే వెంట‌నే ఆ సినిమా పేరుతోనో లేదంటే అందులోని ముఖ్య పాత్ర‌ల పేరుతో రెస్టారెంట్‌లు ఏర్పాటు చేయ‌డం కామ‌న్‌గా మారింది. ఆ మ‌ధ్య బాహుబ‌లి చిత్రంలోని పాత్ర‌ల పేరుతో మెనూనే రెడీ చేసి జ‌నాల దృష్టిని ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేశారు హోట‌ల్ నిర్వాహ‌కులు. అయితే ఇప్పుడు హైదరాబాద్ లోని కొంపల్లిలో ‘రంగస్థలం’ పేరుతో ఓ రెస్టారెంట్ ఓపెన్ చేశాడు ఓ హోట‌ల్ నిర్వాహ‌కుడు.

Rangasthalam Restaurant in Hyderabad

ఈ రెస్టారెంట్‌కు సంబందించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ రెస్టారెంట్‌కు ‘రంగస్థలం’ అనే పేరు పెట్టడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటో తెలియదు కానీ.. సదరు రెస్టారెంట్‌కి మాత్రం యమ పబ్లిసిటీ వచ్చేసింది. అటుగా వెళ్తున్న జనాలంతా ఈ రెస్టారెంట్ గురించే మాట్లాడుకుంటూ.. ఓ సారి అందులోకి వెళ్లి వస్తున్నారు. మెగా హీరో రామ్ చరణ్ తేజ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న‘రంగస్థలం’ సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే.

Rangasthalam Restaurant in Hyderabad

ప్రపంచ వ్యాప్తంగా 1700 స్క్రీన్ లపై ‘రంగస్థలం’ విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాలో పాటలు, డైలాగ్స్, టీజర్లు, ట్రైలర్లు, గ్రామీణ వాతావరణం ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి.