రాంచరణ్ గ్యారేజీలో మరో లగ్జరీ కారు..

41
ram charan

మెగాపవర్ స్టార్ రాంచరణ్ ఖాతాలో మరో న్యూ బ్రాండ్ లగ్జరీ కారు చేరింది. ఇటీవలే కారును మెర్సిడెస్ మేబాచ్ జీఎల్‌ఎస్ 600ను రాచ్ చరణ్ బుక్ చేసుకోగా అది రామ్ చరణ్ ఇంటికి డెలివరీ అయింది.

ఈ కారు డెలివరీకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కారును అందించిన కంపెనీ సిబ్బందితో ఈ సంద‌ర్భంగా ఫొటోలు దిగారు. అధునాతన టెక్నాలజీతో కలిగిన ఈ కారును చరణ్ డ్రైవ్ చేస్తూ కనిపించారు.

ఈ కారు ధర రూ. 2.5 కోట్లు. హై సెక్యూరిటీ, లేటెస్ట్ టెక్నాలజీతో అత్యంత సౌకర్యవంతంగా ఉండనుంది. చరణ్ దగ్గర ఇప్పటికే ఫెరారీ, బీఎమ్‌డబ్ల్యూ వంటి ఖరీదైన కార్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇటివలే చరణ్ మిత్రుడు, ఆర్ఆర్ఆర్ కో-స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా లగ్జరీ కారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే..