కన్నీరు పెట్టుకున్న రకుల్..

56

హీరోయిన్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగుతున్నారు. తాజాగా ఆమె తన కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి థియేటర్‌లో సినిమా చూసింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బెల్ బాటమ్’ సినిమాను వీక్షించింది. ఈ విషయాన్ని తన ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది.

చాలా నెలల తర్వాత థియేటర్లో సినిమా చూడటం సంతోషంగా ఉందని రకుల్ చెప్పింది. స్క్రీన్ పై టైటిల్స్ పడటం ప్రారంభమైన వెంటనే భావోద్వేగానికి గురయ్యానని తెలిపింది. ఆనందంతో కన్నీరు పెట్టుకున్నానని చెప్పింది. కరోనా క్లిష్ట పరిస్థితుల్లో థియేటర్ లో సినిమా విడుదల చేసిన అక్షయ్ కుమార్, చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

ఇక రకుల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌ సింగ్‌ చేతిలో ఆరడజనకు పైగా ప్రాజెక్ట్‌లున్నాయి. తెలుగులో ‘కొండపొలం’, తమిళంలో ‘భారతీయుడు-2’, ‘అక్టోబర్‌ 31 లేడీస్‌ నైట్‌’, ‘అయలాన్‌’తోపాటు బాలీవుడ్‌లో ‘ఎటాక్‌’, ‘మేడే’, ‘థ్యాంక్‌ గాడ్‌’, ‘డాక్టర్‌ జీ’ వంటి సినిమాల్లో ఆమె నటిస్తున్నారు.