- Advertisement -
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఎన్డీఏ అభ్యర్ధిగా జేడీయూ ఎంపీ హరివంశ్ సింగ్ నారాయణ్, ప్రతిపక్షాల తరపున ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా పోటీచేస్తున్నారు. ఇప్పటికే పలు తాము ఎవరికి మద్దతిస్తున్నామో తెలపగా తాజాగా టీఆర్ఎస్ తన స్టాండ్‌ని వెల్లడించింది. రాజ్యసభడిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది.
ప్రస్తుతం రాజ్యసభలో మొత్తం 245 మంది సభ్యులకుగాను… 244 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 123 మంది మద్దతు పొందినవారికి డిప్యూటీ చైర్మన్ పదవి దక్కుతుంది. ఎన్డీఏకు 101 మంది సభ్యుల బలం ఉండగా ప్రతిపక్షాల అభ్యర్ధికి 91 మంది సభ్యుల బలం ఉంది. దీంతో సంఖ్య పరంగా గెలిచే అవకాశాలు ఎన్డీఏకే ఎక్కువగా ఉన్నాయి.
- Advertisement -