హరివంశ్‌ సింగ్‌కు ఎంపీ సంతోష్‌ శుభాకాంక్షలు..

182
MP Santosh Kumar

హరివంశ్‌ నారాయణ్ సింగ్ వరుసగా రెండోసారి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ లో హరివంశ్ సింగ్ విజయం సాధించినట్టు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. హరివంశ్ తొలిసారిగా 2018 ఆగస్టు 8న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవీకాలం 2020 ఏప్రిల్‌తో ముగిసింది. అనంతరం మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా హరివంశ్‌ నారాయణ్ సింగ్‌కు టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ట్విట్టర్‌ ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.